తన స‌క్సెస్ మంత్రా ఏంటో చెప్పిన హీరో..!!

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏజెంట్ గా ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు పొందాడు హీరో న‌వీన్ పొలిశెట్టి. ఈ సంవత్సరం జాతిర‌త్నాలు చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డ‌మ్ తెచ్చుకున్నాడు నవీన్. ప్ర‌స్తుతం జాతిర‌త్నాలు స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, యూఎస్లో హాలీడే వెకేష‌న్ ను ఆనందంగా గ‌డుపుతున్నాడు నవీన్ పోలిశెట్టి.

ఈ రెండు మూవీస్ విజయం వెనుక ఉన్న ‌ర‌హ‌స్య‌మేంటో చెప్పు కొచ్చాడు ఈ యువ హీరో. స్క్రిప్ట్ ద‌శ‌లో ఉన్న‌పుడు కథ పై ఎక్కువ శ్ర‌ద్ద‌ పెట్ట‌డమే తన విజ‌యానికి ముఖ్య కార‌ణ‌మ‌ని చెప్పాడు నవీన్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌, జాతిర‌త్నాలు చిత్రాలకు న‌వీన్ పొలిశెట్టి స్క్రిప్ట్ ప‌నులు కూడా చూసుకోవ‌డం వ‌ల్లే, ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద పెద్ద స‌క్సెస్ అందుకున్నాయ‌ని అందరు అంటారు.త్వరలోనే న‌వీన్ త‌న కొత్త చిత్రం అనుష్క‌తో క‌లిసి చేయనున్నాడు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియనున్నాయి.

Share post:

Latest