పెద్దిరెడ్డిపై లోకేష్‌ ఫైర్..ఎందుకంటే…!?

మంత్రి పెద్దిరెడ్డి పై టీడీపీ నేత అయిన నారా లోకేష్ తీవ్రంగా మండి పడ్డారు. పుంగ‌నూరు వీర‌ప్పన్ పెద్దిరెడ్డి ని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎర్రచంద‌నం చెట్లను న‌రికేస్తున్నట్టే ప్రజా స్వామ్యాన్నీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. బయటి వ్యక్తులను తీసుకొచ్చి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని పెద్దిరెడ్డి పై ఆరోపిస్తూ,తీవ్రంగా మంది పడ్డారు.

పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కళ్యాణ మండపంలో 5 వేల మంది మకాం వేశారని, అక్కడే ఉంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తున్న వారిని టీడీపీ నేతలు అడ్డుకున్నారని కూడా నారా లోకేష్ చెప్పారు. వైసీపీ రిగ్గింగ్‌, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందన్నారు. ఈసీ దీని పై వెంటనే స్పందించి మంత్రులను అదుపులోకి తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Share post:

Latest