ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాల‌య్య‌..ఎందుకోస‌మంటే?

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎందుకూ.. ఏమిటీ.. అన్న వివ‌రాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవ‌ల రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కూడా రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. రోజా ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకొన్నారు. అంతేకాదు, త్వరగా కోలుకోవాలాని ఆకాంక్షించార‌ట‌. ఇక బాలయ్య నుంచి ఫోన్ రావడంపై రోజాతో పాటు కుటుంబ స‌భ్యులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, బాలకృష్ణ, రోజు ‘భైరవ ద్వీపం’ సినిమాలో మొద‌టిసారి క‌లిసి న‌టించారు. ఈ చిత్రంతో రోజా కెరీర్‌నే ట‌ర్న్ అయింది. ఇక ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిన వీరిద్ద‌రూ టాలీవుడ్ హిట్ పెయిర్‌గా గుర్తుంపు కూడా పొందారు. అయితే రాజ‌కీయాల కార‌ణంగా కాల‌క్ర‌మేన వీరి మ‌ధ్య దూరం పెరుగుతూ వ‌చ్చింది.

Share post:

Popular