ఓటీటీలోకి నాగార్జున `వైల్డ్ డాగ్`.. విడుద‌ల ఎప్పుడంటే?

కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `వైల్డ్ డాగ్‌`. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దియా మీర్జా హీరోయిన్‌గా న‌టించ‌గా.. సయామీ ఖేర్, అలీ రెజా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.

భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల అయింది. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి టాకే వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లెక్స్ వారు పొందినట్లు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ చిత్రాన్ని మే మూడో వారంలో విడుదల చేసేందుకు నెట్ ఫ్లెక్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Popular