బరిలోకి దిగుతున్న `బంగార్రాజు`..టైమ్ ఫిక్స్ చేసిన నాగ్‌!

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున్‌కు సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో హిట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది.

దాంతో ఆ పాత్ర పేరుతో, అదే లుక్ తో గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయ‌బోతున్న‌ట్టు క‌ళ్యాణ్ కృష్ణ మ‌రియు నాగ్ ఎన్నో సంద‌ర్భాల్లో తెలిపారు. కానీ, ఈ చిత్రం సెట్స్ మీద‌కు మాత్రం వెళ్ల‌లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తాజాగా మరోసారి బంగార్రాజు సినిమాకు సంబంధించిన న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా జూలై రెండవ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున వెల్ల‌డించాడు. మొద‌టి పార్ట్‌లో నాగ్ స‌ర‌స‌న న‌టించి అల‌రించిన ర‌మ్య‌కృష్ణ రెండో పార్ట్‌లోను న‌టిస్తుంద‌ట‌. మొత్తానికి బంగార్రాజు బరిలోకి దిగ‌డానికి ముహూర్తం కుద‌ర‌డంతో.. ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.