అల్లుడికి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన నాగ‌బాబు..వీడియో వైర‌ల్‌!

సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇటీవ‌ల త‌న ముద్దుల కూతురు నిహారిక కొణిదెలను గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డకు ఇచ్చి వివాహం చేసిన సంగ‌తి తెలిసిందే. రాజస్థాన్‌లో నిహారిక‌, చైత‌న్య పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా అల్లుడు చైత‌న్య‌కు నాగ‌బాబు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ గిఫ్ట్‌ను ఉగాది సందర్భంగా ఇవ్వాల్సి వుందని, కానీ కాస్తంత ఆలస్యం అయిందని చెప్పుకొచ్చారు నాగ‌బాబు. ఇంతకీ ఈ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు.

దీని ఖరీదు దాదాపు రూ.70 లక్షలు ఉంటుదని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నాగ‌బాబు అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest