సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హ‌రికి క‌రోనా పాజిటివ్‌..!

బాలీవుడ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండ‌డంతో చాలా మంది సెలబ్రిటీస్ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హ‌రి కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లంద‌రు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బ‌ప్పి ల‌హ‌రి మేనేజ‌ర్ తెలిపారు. ఆయ‌న క్షేమం కోరుకునే వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాం అని స్పోక్స్ ప‌ర్స‌న్ అన్నారు.

- Advertisement -

ఇప్ప‌టికే బాలీవుడ్ నటుడు మ‌నోజ్ క‌రోనా బారిన ప‌డ‌గా, అనంత‌రం యాక్టర్‌ ఆశిష్‌ విద్యార్థి , సిద్ధార్థ్‌ చతుర్వేది, చిత్ర దర్శకుడు అమిత్‌ శర్మ,బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, సంజయ్‌లీలా భన్సాలీ, నటుడు పరేష్‌ రావల్,మాధవన్,ఆమిర్‌ ఖాన్‌,మనోజ్‌ బాజ్‌పాయ్‌,దర్శకుడు కనుబెల్ ఇలా ప‌దిహేనుకు పైగా బాలీవుడ్ సెలబ్రిటీస్ క‌రోనా బారిన ప‌డ్డారు.

Share post:

Popular