బైక్‌పై నుంచి ప‌డ్డ మంచు విష్ణు-ప్రగ్యా జైశ్వాల్..వీడియో వైర‌ల్‌!

క‌లెక్ష‌న్ మోహ‌న్ బాబు త‌న‌యుడు, హీరో మంచు విష్ణు, ప్ర‌గ్యా జైశ్వాల్ బైక్‌పై నుంచి స్కిడ్ అయ్యి ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో మంచు విష్ణుకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇదంతా జ‌రిగింది ఇప్పుడు కాదు..రెండేళ్ల క్రితం జ‌రిగింది. ఒకప్పుడు సినిమాల్లో యాక్షన్‌ స్టంట్లను డూప్‌లతోనే చేయించేవారు. కానీ, ఇప్పుడు హీరోలే ముందుకు వ‌చ్చి రిస్క్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదాలు జ‌రిగి హీరోలు గాయ‌ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి.

- Advertisement -

అలా తనకు జరిగిన ఓ ప్రమాదాన్ని గుర్తుకు చేసుకున్నాడు హీరో మంచు విష్ణు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం `ఆచారి అమెరికా యాత్ర`. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదాన్ని విష్ణు తాజాగా అభిమానుల‌తో పంచుకున్నాడు. `నాకు ఇంకా గుర్తింది. ఆ యాక్షన్‌ సీన్‌ వద్దని స్టంట్‌ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ని హెచ్చరించాను. కానీ వారు నా మాట వినలేదు.

ఆ సమయంలో నాతో పాటు ప్రగ్యా ప్రాణాల‌ని సైతం రిస్క్‌లో పెట్టినందుకు ఇప్ప‌టికీ నాకెంతో బాధగా ఉంటుంది. అదృష్టవశాత్తు ఆమె బాగానే ఉంది. నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నా భార్య విరానికా గర్భవతి. నా వల్ల తను ఎంతో భయపడింది. ఈ విషయమై ఇప్పటికీ నేను తనకి క్షమాపణలు చెబుతూనే ఉన్నాను.` అంటూ అందుకు సంబంధింని వీడియోను పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైల‌ర్‌గా మారింది.

https://www.instagram.com/p/COAUZWYgN6D/?utm_source=ig_web_copy_link

Share post:

Popular