నిద్ర మాత్రలు మింగి టీవీ న‌టుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!

మ‌ల‌యాళ‌ సీరియ‌ల్ న‌టుడు ఆదిత్య జ‌య‌న్ ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఆదివారం సాయంత్రం కారులో కూర్చున్న టైములో త‌న చేతి న‌రాలున క‌ట్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర ర‌క్త‌స్రావం జరగటంతో వెంట‌నే ఆతని త్రిచూర్ ప్ర‌భుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా మ‌ణిక‌ట్టును కోసుకోవ‌డానికి ముందు అత‌డు అధిక మోతాదులో నిద్ర‌మాత్ర‌లు మింగాడ‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని డాక్టర్స్ వెల్ల‌డించారు.

కాగా బుల్లితెర న‌టి అంబిలి దేవి త‌న భ‌ర్త ఆదిత్య జ‌య‌న్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం అందరికి తెలిసిందే. ఇలా ఇద్దరి మధ్య గొడ‌వ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న సూసైడ్‌కు య‌త్నించ‌డం సంచ‌లనంగా మారింది.కాగా వీళ్లిద్ద‌రూ బుల్లితెర మీద ‘సీత’ అనే సీరియ‌ల్‌లో దంప‌తులుగా న‌టించారు. 2019లో వీరికి వివాహం అయింది. వీరికి అర్జున్ అనే కొడుకు కూడా ఉన్నాడు.