కోవిడ్ వాక్సిన్ తీసుకున్న మరో బాలీవుడ్ భామ..!

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మ‌లైకా ఆరోరా తాజాగా కోవిడ్ వాక్సిన్ తీసుకున్న‌ది. ఇవాళ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న‌ట్లు ఆమె స్వయంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మ‌లైకా వ‌య‌సు ప్ర‌స్తుతం 47 ఏళ్లు, ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ వాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో, త‌న ఇన్‌స్టా సందేశంలో తన అభిమానుల్ని కూడా టీకా వేసుకోవాల‌ని మలైకా కోరారు.

వైర‌స్ ‌పై యుద్ధంలో మనం అందరం గెల‌వాల‌న్నారు. టీకా తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు అంటూ మలైకా త‌న మెసేజ్‌లో తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి తాను అర్హురాల‌ని ఆమె త‌న మెసేజ్‌ను సైనాఫ్ చేసింది. గ‌త సంవత్సరం సెప్టెంబ‌ర్‌లో మ‌లైకా ఆరోరాకు క‌రోనా వైర‌స్ భారీ పడ్డ విష‌యం మనకు తెలిసిందే. తాను పాజిటివ్ అని తేలిన త‌ర్వాత ఆమె వెంటనే తన నివాసంలో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.

Share post:

Latest