స‌మ్మ‌ర్‌ను కూల్ చేస్తున్న మ‌హేష్‌, త‌మ‌న్నా..యాడ్ వైర‌ల్‌‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స‌మ్మ‌ర్‌ను కూల్ చేసేందుకు మ‌రోసారి జ‌త‌క‌ట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి ఇటీవ‌ల మ‌హేష్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో ఓ యాడ్ ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ముఖ ఏసీ కంపెనీ లాయిడ్ విడుదల చేసిన కొత్త `లాయిడ్ గ్రాండ్ హెవీ డ్యూటీ’ ఏసీ కోసం ఈ యాడ్‌ను తెర‌కెక్కించారు. అయితే తాజా ఈ యాడ్ త‌మ‌న్నా త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇక యాడ్‌లో తమన్నా, మ‌హేష్‌లు ఒకరినొకరు బేబీ అంటూ ప్రేమగా పిలుచుకుంటూ ఆక‌ట్టుకున్నారు.

అలాగే ఏసీకి సంబంధించిన ప్రత్యేకతలను తమన్నా ఒకొక్కటిగా వివరిస్తూ ఉంటుంటే..కొంచెం సెర్చ్ చేసి ఉంటే ఇంకా మంచి ఏసీ దొరికేద‌ని మహేష్ అంటుంటారు. మొత్తానికి ఈ యాడ్ అదిరిపోవ‌డ‌మే కాదు.. నెట్టింట్లో వైర‌ల్‌గా కూడా మారింది. మ‌రి ఆ యాడ్‌పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

https://www.instagram.com/p/CNKYkjGpzrC/?utm_source=ig_web_copy_link

Share post:

Latest