చేతిలో ఏడు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ..!?

బాలీవుడ్ నటి అందాల భామ కృతి స‌న‌న్ అటు హిందీ ప్రేక్ష‌కులకే కాదు ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా సుప‌రిచితమే. తెలుగు‌లో మహేష్ సరసన వ‌న్ నేనొక్క‌డినే , చైతూతో దోచేయ్ చిత్రాలు చేసిన కృతి స‌న‌న్ ఇప్పుడు బాలీవుడ్‌లో తన స‌త్తా చూపెడుతుంది. తాజాగా ఈ అమ్మ‌డికి పాన్ ఇండియా చిత్రంలో న‌టించే అవకాశం ద‌క్కింది. ఈ చిత్రంతో నటి కృతి స‌న‌న్ రేంజ్ మ‌రోస్థాయికి చేర‌డం పక్కా అనిపిస్తుంది.

కృతి స‌న‌న్ లిస్ట్ లో ప్ర‌స్తుతం ఏడు చిత్రాలు ఉన్నాయి. ఆదిపురుష్‌, బేడియాల‌తో పాటు అక్ష‌య్ కుమార్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అక్ష‌య్ పాండే, హౌజ్ ఫుల్ ఫైవ్, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గ‌న‌ప‌త్‌, ఎమోష‌న‌ల్ డ్రామా మిమి, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ హ‌మ్ దో హ‌మారే దో వంటి మూవీస్ లో ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న కృతి రానున్న రోజుల‌లో బాలీవుడ్‌లో బాగా రాణిస్తుందేమో అంటున్నారు.

Share post:

Latest