షాకింగ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సీరియల్ నిర్మాత..!

బుల్లితెర ప్రేక్షకులకు దిమ్మ తిరిగే వార్త చెప్పారు కార్తీకదీపం సీరియల్ నిర్మాత గుత్తా వెంకటేశ్వరావు. తాజాగా ఈ సీరియల్ 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని బుల్లితెర పై సరికొత్త రికార్డు సృష్టించింది. టాప్ రేటింగ్ సీరియల్‌గా జాతీయ స్థాయిలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వెయ్యి ఎపిసోడ్‌లను పూర్తి చేయడంతో కార్తీకదీపం సీరియల్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ సీరియల్ కథ క్లైమాక్స్‌కి చేరిందని, తొందర్లోనే సీరియల్ కి శుభం కార్డ్ వేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో షాకింగ్ న్యూస్ చెప్పారు కార్తీకదీపం నిర్మాత. ఈ సీరియల్ ఎప్పుడౌతుందిరా బాబూ అని చాలా మంది ప్రేక్షకులు మదిలో ఉన్న ప్రశ్న. అభిమానుల తరుపున ఈ ప్రశ్నను డైరెక్ట్‌గా సీరియల్ నిర్మాతనే అడిగింది మన వంటలక్క. దానికి నిర్మాత సమాధానం ఇస్తూ, ఇంకో వెయ్యి ఎపిసోడ్‌లకు వెళ్తుందని మరో మూడు నాలుగేళ్లు అంటూ బాంబ్ పేల్చారు ఆయన. నాలుగేళ్లా అంటే అప్పటికి మేం పెరిగి పెద్ద అవుతాం అని మోనిత అంటే, అవును ఆంటీలు అవుతారు అని పంచ్ వేశారు నిర్మాత. ఇదంతా చూస్తుంటే, కార్తీకదీపం సీరియల్ ఇప్పుడుఅప్పుడే ముగిసేలా కనిపించటం లేదు.

Share post:

Latest