రా ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్…!?

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నిర్మాతగా ముందుకి దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ చివరిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా చిత్రంలో చేశారు. కానీ ఈ చిత్రం ప్లాప్ అయింది. కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన కొత్త సినిమాలో ఏకంగా రా ఏజెంట్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ లో రాజేంద్ర అనే దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం చేయనున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక రా ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. గతంలో పైసా వసూల్ చిత్రంలో నందమూరి బాలకృష్ణ రా ఏజెంట్ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ బాబాయ్ చేసినటువంటి సీక్రెట్ ఏజెంట్ తరహా పాత్రలో నటించడం విశేషం.

Share post:

Popular