`వ‌కీల్ సాబ్‌` నుంచి మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ సాంగ్ విడుద‌ల‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా..నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, బోని క‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రో ప‌వ‌ర్ ఫుల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

`క‌దులు కదులు కట్లు తెంచుకుని కదులు` అంటూ సాగే ఈ సాంగ్ ఆక‌ట్టుకుంటోంది. ఈ పాటని శ్రీకృష్ణ, హేమచంద్ర ఆలపించ‌గా.. ప్రముఖ రచయిత సుద్దాల ఆశోక్‌ తేజా సాహిత్యం సమకూర్చారు. కాగా, ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌ల‌న్నీ ప్రజాదరణ పొంద‌గా.. తాజాగా విడుద‌లైన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

Share post:

Latest