పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది..!?

జబర్దస్త్ లో జూనియర్ ఆర్టిస్టుగా మొదలు పెట్టి, స్క్రిప్ట్ రైటర్ గానూ, టీమ్ లీడర్ స్థాయికి ఎదిగ్గాడు హైపర్ ఆది . తనకంటూ ఒక రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. హైపర్ ఆది సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేస్తున్నాడు. ఇక ఢీ షో అయితే తన కెరీర్ లో మరో ఎత్తు అనే చెప్పచు. ఆది త్వరలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. కానీ హైపర్ ఆది మాత్రం ముందు సుధీర్, యాంకర్ ప్రదీప్ పెళ్లి అయితేనే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని గతంలో చెప్పాడు.

కానీ తాజాగా హైపర్ ఆది పెళ్లి విషయంలో తన డెసిషన్ మార్చుకున్నాడని తెలిసింది. తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని అయితే తన తల్లిదండ్రులు చూసిన ఒక అమ్మాయిని పెళ్లాడతానని చెప్పుకొచ్చాడు ఆది. అంతే కాకుండా హైపర్ ఆది తన పెళ్లి తేదీ కూడా చెప్పేసి అందరినీ సర్ ప్రైజ్ చేసాడు. తనకు నెక్ట్స్ ఇయర్ వివాహం అవుతుందని హైపర్ ఆది క్లారిటీ ఇచ్చేశాడు. ఈ విషయం విన్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Share post:

Popular