ఆ యంగ్ హీరో సినిమాతో రీఎంట్రీకి రెడీ అయిన జెనీలియా?

జెనీలియా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌ట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. `సత్యం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన జెనీలియా..కొన్నాళ్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది.

కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలోనే జెనీలియా న‌టుడు రితేష్ దేశ్ ముఖ్‌ను 2012లో ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ దంప‌తుల‌కు రాయస్‌, రాహిల్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన జెనీలియా.. ఇప్పుడు మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

మంచి కథలు వస్తే సినిమా చేయాలనీ జెనీలియా భావిస్తుంద‌ట‌. అంతేకాదు, ఇప్ప‌టికే ప‌లువురు ద‌ర్శ‌క, నిర్మాతలు కూడా ఆమెను సంప్ర‌దించార‌ట‌. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాతో జెనీలియా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఓ నూత‌న ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ వీరిద్ద‌రికీ న‌చ్చ‌డంతో.. వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని తెలుస్తోంది.

Share post:

Popular