విలన్ గా బిజీ అవుతున్న ఫహద్ .!

జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును అందుకున్నాడు ఫహద్ ఫాజిల్. నటి నజ్రియా నజీమ్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఫహద్ ఫాజిల్ కు ఎలాంటి పాత్ర అయినా అవలీల గా చేసేస్తాడు. కాంట్రవర్శి అవుతుందని తెలిసినా కూడా ట్రాన్స్ చిత్రంలో క్రైస్తవ ఫాదర్ గా నటించి, మెప్పించాడు.ఇంకా విలన్ పాత్రలు ఇచ్చిన ఈజీగా చేసేస్తానంటాడు. అందుకే ఇప్పుడు పుష్ప చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి విలన్ గా అడుగు వేయనున్నారు.

మరో విశేషం ఏంటంటే, మలయాళంలో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ పుష్ప చిత్రం అక్కడ కూడా రిలీజ్ కాబోతోంది. బెస్ట్ ఆర్టిస్ట్ గా పలు అవార్డులు అందుకున్న మలయాళీ నటుడు అయిన ఫహద్ ఫాజిల్ పుష్ప మూవీలో విలన్ గా నటించడం విశేషమే అనే చెప్పచు.ఇప్పుడు తమిళంలోనూ కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో ఫహద్ విలన్ గా నటిస్తున్నాడు. భాషా బేధం ఏమాత్రం లేకుండా పరభాషల్లో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ తన సత్తా చాటబోతున్నాడు.

Share post:

Latest