బాల‌య్య `బిబి3` నుంచి డ‌బుల్ ట్రీట్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ముచ్చ‌ట‌గా మూడో సారి `బిబి 3` వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారక క్రియోషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28న విడుదల ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన చిత్ర యూనిట్.. ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్‌ను మాత్రం వెల్ల‌డించారు. దీంతో ఈ సినిమా టైటిల్ ఎప్పుడూ ప్ర‌క‌టిస్తారా అన్న అస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొందిరు.

అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఉగాది పండ‌గ‌కు ఈ సినిమా నుంచి డ‌బుల్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంద‌ట‌. అందులో ఒక‌టి టైటిల్ ప్ర‌క‌ట‌న కాగా.. మ‌రొకిటి బాలయ్య అఘోరా లుక్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ట‌. ఇదే నిజ‌మేతే.. బాల‌య్య ఫ్యాన్స్‌కు పండ‌గ‌నే చెప్పాలి. ‌

Share post:

Popular