మెగా హీరోకు సాయం చేస్తున్న సుకుమార్‌!

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే జ‌గపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్ప‌టికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు నుంచి టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటనని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసి వెల్లడించారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ టీజ‌ర్‌ను ఏప్రిల్ 5 ఉదయం 11 గంటల 3 నిమిషాలకు విడుద‌ల చేసి.. సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేందుకు సాయం చేయ‌బోతున్నారు. హైదరాబాద్ దసపల్లా కన్‌వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ రిప‌బ్లిక్ టీజ‌ర్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.‌

Image

Share post:

Popular