త‌ల్లి కాబోతోన్న `వైల్డ్ డాగ్‌` హీరోయిన్‌..ఫొటో వైర‌ల్‌!

బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. అక్కినేని నాగార్జున హీరోగా తెర‌కెక్కిన `వైల్డ్ డాగ్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు భార్య‌కు దియా క‌నిపించ‌నుంది. ఈ రోజే ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది.

ఇదిలా ఉంటే.. దియా తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని ఈ ఏడాది ఫిబ్రవరిలో దియా రెండో వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ముంబాయి బాంద్రాలోని బెల్ ఏయిర్ అపార్ట్‌మెంట్‌లో ఘ‌నంగా జరిగింది.

అయితే దియా త్వ‌రలోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. తాను తల్లి కాబోతున్నానన్న విషయాన్ని తాజాగా దియా సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఓ అంద‌మైన ఫొటొను కూడా పంచుకుంది. దీంతో సినీ ప్ర‌ముఖుల‌‌తో పాటు అభిమానులు ఆమెకు విషెస్ తెలియ‌జేస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం భర్త వైభవ్ రేఖీతో కలిసి దియా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.

https://www.instagram.com/p/CNIATcpjlOt/?utm_source=ig_web_copy_link

Share post:

Popular