`ఏవండోయ్ ఓనర్ గారు` అంటున్న దేత్త‌డి హారిక‌..అదిరిన పోస్ట‌ర్‌!

దేత్త‌డి హారిక‌.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలోనే యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హారిక‌.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోలో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న హారిక టైటిల్ గెలుచుకోలేక‌పోయినా.. సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది.

ఇక ఈ షో త‌ర్వాత ప‌లు వెబ్ సిరీస్ చేస్తున్న‌ట్టు హారిక తెలిపింది. అయితే తాజాగా ఆమె న‌టిస్తున్న వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను దేత్తడి హారిక విడుదల చేసింది. `ఏవండోయ్ ఓనర్ గారు` అనే టైటిల్ తో హారిక వెబ్ సిరీస్ ను చేస్తుంది.

షూటింగ్ దాదాపుగా ముగిసిందని త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దం అవుతుందని హారిక సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. హ‌రీష్ నాగ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్ సిరీస్‌లో హారిక‌కు జోడీగా అఖిల్ రాజ్ న‌టించారు. తాజాగా విడుద‌ల చేసిన ఈ వెబ్ సిరీస్ పోస్ట‌ర్ అదిరిపోయింద‌ని చెప్పాలి.

Evandoy Owner Gaaru First Look Released

Share post:

Popular