లేచిపోదామ‌న్న ప్రియుడు.. వ‌ద్ద‌న్న ప్రేయ‌సి.. క‌ట్ చేస్తే

వెన‌కా ముందు చూడ‌కుండా ప్రేమించ‌డం ఆ త‌ర్వాత జీవితాల‌ను నాశ‌నం చేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఎంతో మంది యువ‌తీయువ‌కులు ఇలాగే త‌మ భ‌విష్య‌త్తును చేజేతులా నాశ‌నం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో జీవితాల‌ను బుగ్గి చేసుకుంటున్నారు. క‌న్న‌వారికి క‌డుపుకోత‌ను మిగుల్చుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. తమిళనాడు రాష్ట్రం కల్లకురిచ్చి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వన్నియార్ కులానికి చెందిన సరస్వతి(18), అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు రంగసామి(21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల సరస్వతికి ఆమె తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. దీంతో ప్రేమికుడు రంగ‌స్వామి కంగారు పడ్డాడు. ప్రయురాలికి ఫోన్ చేసి ఒక ప్రదేశానికి రమ్మని చెప్పాడు. అక్క‌డికి వెళ్లిన‌‌ యువ‌తి ఎప్పుడూ లేని విధంగా ప్రేమించడానికి రెండు మనసులు చాలు.. కానీ పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాలు కావాలి.. అంటూ సినిమా డైలాగ్ లు చెప్పింది. మన కులాలు వేర‌ని, పెద్ద‌లు ఒప్పుకోర‌ని, నేను అత‌నినే చేసుకుంటాన‌ని ప్లేటు పినాయించింది.

ఇదిలా ఉండ‌గా ప్రియురాలి నోటివెంట ఆ మాట‌లు వ‌స్తాయ‌ని ఊహించ‌ని రంగ‌స్వామి ఒక్క‌సారి షాక్‌కు గుర‌య్యాడు. ఇక్కడి నుంచి మనం వేరే ఊరు పారిపోదాం.. అక్కడ పెళ్లి చేసుకుందాం. కులాలు, మతాలు ప్రేమకు అడ్డుకాదని చాటిచెప్పుదామ‌ని ప్రియురాలికి న‌చ్చ‌జెప్పాడు. బ‌తిమిలాడాడు. అయిన‌ప్ప‌టికీ ఆమె అందుకు నిరాకరించింది. తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. అంతే రంగ‌స్వామి ఆగ్రహంతో రగిలిపోయాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని నిర్నయించుకున్నారు. అప్ప‌టికే అక్క‌డే ఉన్న త‌న తమ్ముడు(16), స్నేహితుడు రవీంద్రన్‌(26)ను తో కలసి కిరాకతంగా చంపేశాడు. స‌రస్వ‌తి మెడ‌కు ఆమె చున్నీనే బిగించి ప్రాణాలు తీసి నిందితులు పరారయ్యారు. కూతురు ఇంటికి రాపోవ‌డంతో గాలింపు చేప‌ట్టిన త‌ల్లిదండ్రుల‌కు ఇంటికి సమీపంలోనే స‌ర‌స్వ‌తి మృత‌దేహం క‌నిపించింది. పోలీసుల‌కు సమాచారం ఇవ్వ‌గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె హత్యకు గురైన నాటి నుంచి ప్రియుడు రంగసామి ఊళ్లో కనపించలేదని తెలియడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. కల్లకురిచ్చి వద్ద ఓ బ్రిడ్జి కింద దాక్కున్న రంగసామి, రవీంద్రన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కి తరలించి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులిద్ద‌రిని పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.