తెలంగాణ‌లో కొత్త‌గా 3,052 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారి అంతు చూసేందుకు.. అన్ని దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ జోరుగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

అయిన‌ప్ప‌టికీ, గ‌త రెండు వారాలుగా క‌రోనా మ‌రింత వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణ‌లో కూడా భారీ సంఖ్య క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర‌ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 3,052 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,581 కు చేరుకుంది.

అలాగే నిన్న ఏడుగురు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,772 ‌కు పెరిగింది. ఇక నిన్న ఒక్క‌రోజే 778 మంది కోలుకోగా.. రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,678 మంది రిక‌వ‌ర్ అయ్యి ఇంటికి చేరారు.

Share post:

Latest