నితిన్ సినిమాపై క‌రోనా దెబ్బ‌..షూటింగ్‌కు బ్రేక్‌?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‌లో హిట్ అయిన `అంధాదున్` సినిమాకి రీమేక్‌గా మాస్ట్రో తెర‌కెక్కుతోంది. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. ఈ క్ర‌మంలోనే షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తుండ‌గా.. ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా దెబ్బ కొట్టింది,

తాజాగా మాస్ట్రో సినిమాటోగ్రాఫ‌ర్ యువ‌రాజ్ క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక యువ‌రాజ్‌కు క‌రోనా సోక‌డంతో.. మాస్ట్రో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అంద‌రూ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest