క‌రోనా బారిన ప‌డ్డ రాహుల్ గాంధీ!

మునుప‌టితో పోలిస్తే ప్ర‌స్తుతం క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుల పై‌నే కాకుండా.. సెలెబ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

- Advertisement -

ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు.

ఇటీవల తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ టెస్ట్‌లు చేయించుకుని తగు జాగ్రత్తలు పాటించాలని, సురక్షితంగా ఉండాలని కోరారు. కాగా, ఇప్ప‌టికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తీవ్ర జ్వరం వచ్చిన నేపథ్యంలో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చారు.

Share post:

Popular