ర‌జ‌నీకాంత్‌ అవార్డు పై సీఎం కేసీఆర్ హ‌ర్షం..!

త‌మిళనాట సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌కు కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌టుడిగా ద‌శాబ్దాల పాటు ఆయనకంటూ ఒక ప్ర‌త్యేక శైలి చూపెడుతూ,నేటికి దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానుల‌ ఆద‌ర‌ణ పొందుతున్న ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

హిందీ ఇండస్ట్రీ నుండి 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇత‌ర భాష‌ల నుండి ఎంపిక అయ్యారు. ర‌జ‌నీకాంత్ 2000లో ప‌ద్మ‌భూషణ్‌, 2016లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాలు అందుకున్న విష‌యం అందరికి తెలిసిందే. సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2019కి గాను ర‌జ‌నీకాంత్‌కు కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యంతెలిసిందే. ఈ విష‌యాన్ని కేంద్రమంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ ప్ర‌క‌టించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ అందుకోనున్న‌ట్టు ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ తెలియ‌జేశారు.

Share post:

Popular