మరోసారి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు…!?

మాజీ మంత్రి అయిన దేవినేని ఉమకు మరోకసారి సీఐడీ నోటీసులు జారీ చేసి పంపించారు. ఈ నెల 19న కర్నూల్ సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలంటూ దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసి పంపించారు. నిన్న విచారణకు హాజరైయ్యేందుకు 10 రోజులు వ్యవధి కావాలంటూ దేవినేని ఉమా వారిని కోరారు. అయితే, సీఐడీ మాత్రం రెండు రోజులు సమయం మాత్రమే ఇచ్చింది.

సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేసిన క్రమంలో సీఐడీ అధికారులు దేవినేని ఉమ పై కేసు నమోదు చేసిన సంగతి అందరికి తెలిసిందే. సీఎం జగన్ వీడియోను మార్ఫ్ చేశారంటూ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 464, 465, 468, 471, 505 కింద దేవినేని ఉమా పై సీఐడీ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసారు.

Share post:

Popular