బ్రేకింగ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌

High Court

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇక రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్‌ విధించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్‌ఈసీ. నాలుగు వారాల కోడ్‌ అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ధర్మాసనం.

ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. విపక్షాలు వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీం కోర్ట్ నిబంధనల మేరకు కోడ్ విధించలేదన్న హైకోర్ట్.. ఈ వ్యాఖ్యలు చేసింది. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్టే విధించింది. ఇక గతంలో ఎన్నికలను నాలుగు విడుతలుగా నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే.