బాలయ్య “అఖండ “టీజర్ మీకోసం..!

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ లో మూడోసారి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్లవ నామ సంవత్సర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతవరకూ బీబీ 3 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్, అలాగే సినిమా పేరుని తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. బోయపాటి శ్రీను బాలయ్య బాబు ఇదివరకు లెజెండ్, సింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా పై పెద్ద ఎత్తున అంచనాలు ప్రేక్షకులలో నెలకొని ఉన్నాయి.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇదివరకు సినిమాల లాగే ఓ పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమాకు “అఖండ” అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేస్తుండగా అందులో అఘోర గా బాలయ్య బాబు ఒక పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలయ్య బాబు సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Share post:

Latest