సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్..!?

టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోకసారి కరోనా వచ్చింది. గత ఏడాది కూడా బండ్ల గణేష్ కి కరోనాసోకింది. ఆ తరువాత అయన దాని నుండి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోకసారి కరోనా నిర్దారణ అయ్యింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగగా, దానికి బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సమయంలోనే ఆయనకి కరోనా సోకిందని తెలుస్తుంది. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆయనకి జ్వరం, ఒళ్ళు నొప్పులులతో బాధపడ్డాడు.

ఆ తరువాత ఒళ్ళు నొప్పుల ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం నాడు ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.దీంతో ఆయనకు మరోకసారి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో అపోలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యం నిలకడ గానే ఉందని సమాచారం. తనను కలిసిన వారందరిని వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బండ్ల గణేష్ కోరారు. ఇంకా వకీల్ సాబ్ ఈవెంట్కు హాజరైన చాలా మందికి కోవిడ్ బయటపడుతోంది. వాస్తవానికి దిల్ రాజు కు కూడా కరోనా వచ్చింది. పవర్ స్టార్ పవన్ అయితే ఐసోలేషన్ లోకి వెళ్లారు.

Share post:

Latest