హీరోగా మార‌బోతున్న బండ్ల గ‌ణేష్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌..అంజనేయులు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఇక నిర్మాత‌గా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని.

అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పవన్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల‌.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో మ‌ళ్లీ సిల్వ‌ర్ స్కీన్ ఎంట్రీ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈయ‌న హీరోగా మార‌బోతున్నార‌ట‌. కోలీవుడ్‌లో వ‌చ్చిన మండెల అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి బండ్ల ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. అయితే ఈ చిత్రంలో బండ్ల గణేశ్ హీరోగా నటిస్తే బాగుంటుంద‌ని ఓ ద‌ర్శ‌కుడు సూచించార‌ట. అందుకు బండ్ల కూడా ఇంట్ర‌స్ట్ చూపుతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest