వైర‌ల్ పిక్‌: బండ్ల గణేష్‌కి క‌రోనా..సుమ ముందు జాగ్ర‌త్తే మంచిదైంది!

సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ రెండో సారి క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. `వ‌కీల్ సాబ్` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుంచి ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్న బండ్ల క‌రోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది.

ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి బండ్ల గణేశ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌లె జ‌రిగిన వ‌కీల్ సాబ్ ప్రీ రిలిజ్ ఈవెంట్‌లో ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ బండ్ల ఓ రేంజ్‌లో స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్ ఎంత వైర‌ల్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Image

అయితే బండ్ల గణేష్ మాట్లాడిన తరువాత యాంకర్ సుమ.. ఆ మైక్‌ని శానిటైజ్ చేస్తూ కనిపించింది. ఆమె కామెడీకి అలా చేసినా.. ఇప్పుడు నిజంగానే బండ్ల గణేష్‌కి కరోనా సోకిందనే వార్తలు రావడంతో సుమ ముందు జాగ్ర‌త్త ఆమె మంచిదైంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోనే నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Share post:

Latest