ర‌ష్మీ కీల‌క నిర్ణ‌యం..ఇక ఈ యాంక‌ర‌మ్మ‌ను అక్క‌డ చూడ‌లేమ‌ట‌?

బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన ర‌ష్మీ గౌత‌మ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది ర‌ష్మీ. ప్ర‌స్తుతం బుల్లితెర లోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

అయితే ఈ షోకు రాక‌ముందు ర‌ష్మీ ప‌లు చిత్రాల్లో న‌టించింది. కానీ, అవేమి ఆమెకు గుర్తింపును తీసుకురాలేదు. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ త‌ర్వాత కూడా ఒక‌టి, రెండు చిత్రాలు చేసింది. అయిన‌ప్ప‌టికీ, వెండితెర‌పై స‌క్సెస్ కాలేక‌పోయింది. దర్శకనిర్మాతలు కూడా రష్మీ వైపు పెద్దగా చూస్తున్నట్లు కనిపించడం లేదు.

దీంతో తాజాగా ర‌ష్మీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. తనకు కలిసిరాని సినిమా రంగాన్ని ఇక పూర్తిగా పక్కన బెట్టాలని ఆమె డిసైడ్ అయింద‌ట‌. బుల్లితెర‌పై ఎంతో క్రేజ్ ఉంది, ఎన్నో ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయి.. ఇలాంటి స‌మ‌యంలో ఏదైనా సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తే టీవీ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ మొత్తం రీ షెడ్యూల్ చేయాల్సి వ‌స్తుంది. అంత చేసినా.. సినిమాల ద్వారా ఏ మాత్రం గుర్తింపు ల‌భించ‌డం లేదు. అందుకే వెండితెర‌పై దూరం కావాల‌ని ర‌ష్మీ ఫిక్స్ అయిందని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే.. ఇక‌పై ర‌ష్మీని వెండితెర‌పై చూడ‌లేము.

Share post:

Latest