పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన హ‌రితేజ‌..ఫొటో వైర‌ల్‌!

యాంక‌ర్‌, న‌టి హ‌రితేజ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్స్‌, ప‌లు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హ‌రితేజ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1లో పాల్గొని.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది.

ఈ షో త‌ర్వాత హ‌రితేజ క్రేజ్ పెర‌గ‌డంతో పాటు సినిమాల్లో మంచి పాత్ర‌లు కూడా త‌లుపుత‌ట్టాయి. ఇదిలా ఉంటే.. 2015లో దీపక్ రావుని వివాహం చేసుకున్న హ‌రితేజ‌.. ఇటీవ‌ల త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, బేబీ బంప్‌తో వ‌రుస ఫొటో షూట్లు చేస్తూ.. సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయింది.

అయితే తాజాగా హ‌రితేజ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హ‌రితేజ‌నే ఇన్‌స్టాగ్ర‌మ్ వేదిక‌గా వెల్ల‌డింది. ఈ మేర‌కు త‌న భ‌ర్త‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/p/CNTkX3chs3r/?utm_source=ig_web_copy_link

Share post:

Latest