వన్ మోర్ టైం అంటూ ట్వీట్ చేసిన బిగ్ బి..!

దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ ప్రముఖ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ తిరిగి కలిసి పని చేయనున్నారు. హాలీవుడ్‌ హిట్‌ అమెరికన్‌ ఫిల్మ్‌ ది ఇంటర్న్ మూవీని హిందీలో రీమేక్‌ కానుంది. డైరెక్టర్ అమిత్‌ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 2015లో వచ్చిన హిందీ చిత్రం పికు తర్వాత అమితాబ్, దీపికా కలిసి పని చేస్తున్నసినిమా ఇదే.

నా మోస్ట్‌ స్పెషలిస్ట్‌ కో స్టార్‌ అమితాబ్‌గారితో మరోసారి వర్క్‌ చేయనున్నందుకు సంతోషంగా ఉంది అంటూ దీపికా అన్నారు. వన్‌ మోర్‌ టైమ్ అంటూ బిగ్ బి అమితాబ్ ట్వీట్ ‌చేశారు‌. ఇంకా ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా అమితాబ్, దీపిక నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

Share post:

Latest