హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం…!?

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. అజిత్ మరోకసారి వాలిమై దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ మూవీ రూపొందబోతోంది. ఇంతక ముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం ఇది.

దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో కలిసి బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలకు దర్శకత్వం వహించే అద్భుతమైన ఛాన్స్ లభించింది. గతంలో దర్శకుడు సిరుతై శివకు ఈ అరుదైన అవకాశం లభించింది. వీరం, వేదం, వివేగం, విశ్వం అనే నాలుగు చిత్రాలకు అజిత్, శివ కలిసి వర్క్ చేశారు. ఈ నాలుగు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపించాయి. ఒక్క వివేగం చిత్రం మాత్రం అనుకున్నట్లు దర్శక నిర్మాతల అంచనాలను అందుకోలేకపోయింది.

Share post:

Latest