రజనీకాంత్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు..ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ.. ఈయ‌న‌కు అన్ని భాష‌ల్లోనూ అభిమానుల్లోనూ అభిమానులు ఉన్నారు. ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని ఎంద‌రికో ఆద‌ర్శం.

- Advertisement -

అటువంటి ర‌జ‌నీకి తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్ర‌క‌టించింది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్ల‌డిస్తూ.. `భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం.

ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం. రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు` అని పేర్కొన్నారు. దీంతో ర‌జ‌నీకాంత్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ.. ఆయ‌న‌కు విషెస్ తెలిపుతున్నారు.

Share post:

Popular