బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్‌..!

కరోనా బారిన పడ్డ క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ముందస్తూ జాగ్రత్త కింద వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరనున్నట్లు సచిన్ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేశాడు. మార్చి 27న సచిన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిన దగ్గర నుండి తాను ఐసొలేషన్‌లో ఉన్నారు.

భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ మొదలయింది. రికార్డు స్థాయిలో కేసులు బయట పడ్తున్నాయి. ఒక్క రోజులోనే 81 వేల 466 కేసులు నమోదయ్యాయి. కిందటి సంవత్సరం అక్టోబర్‌ 2 తర్వాత దేశంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. కరోనా కారణంగా 469 మంది చనిపోయారు. 117రోజుల తర్వాత అత్యధిక మరణాలు నమోదు కావడం కూడా ఇదే ప్రధమం.

Share post:

Latest