రెండో పెళ్లికి ఓకే చెప్పిన నాగ‌బాబు..షాక్‌లో నెటిజ‌న్లు!

సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్‌కు ఎన్నో ఏళ్లు జడ్జ్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు.. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇక జబర్దస్త్ నుంచి బ‌ట‌య‌కు వ‌చ్చేసిన నాగ‌బాబు.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు.

- Advertisement -

ఈ క్ర‌మంలోనే తాజాగా అభిమానుల‌తో లైవ్ చాట్ చేశారు నాగ‌బాబు. ఈ లైవ్ చాట్‌లో అభిమానులు, నెటిజ‌న్లు అనేక ప్ర‌శ్న‌లు వేయ‌గా.. అన్నిటికి ఓపిగ్గా మ‌రియు ఫ‌న్నీగా స‌మాధానం చెప్పారు మెగా బ్ర‌ద‌ర్‌. ఇందులో భాగంగానే ఓ ఆకతాయి `సర్ మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా` అంటూ నాగబాబును ప్రశ్నించాడు.

అయితే ఆ ప్రశ్నకు నాగబాబు `ఈ వయసులో నాకు పెళ్లా.. మీరంతా ఓకే అంటే నాకు ఓకే` అని సమాధానం ఇచ్చారు. సాధార‌ణంగా ఎవ‌రైనా ఈ వయసులో మళ్లీ పెళ్లి ఏంటీ పిల్లల పెళ్లిలు చేయాలి అని అంటారు. కానీ, నాగబాబు మాత్రం రెండో పెళ్లికి ఓకే అని దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్ప‌డంతో.. నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు.‌

Share post:

Popular