హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో ప‌వ‌ర్ ఫుల్‌ స్టంట్స్ తో రానున్న పవర్ స్టార్..!

వ‌కీల్ సాబ్ సినిమాతో మల్లి రిఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. తొలిసారి ప‌వ‌న్ పీరియాడిక‌ల్ మూవీ చేస్తున్న క్రమంలో అంద‌రి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది.

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. వ‌చ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకి రిలీజ్ చేయనున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేంగంగా సాగుతుంది. ధూమ్ 3, క్రిష్ త్రీ వంటి అనేక పీరియాడిక్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రఫీ చేసిన శామ్ కౌశ‌ల్ ఈ మూవీ కోసం సూప‌ర్ స్టంట్స్ చేయిస్తున్నారు. తాజాగా క్రిష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌ర్ స్టార్ కోసం కౌశ‌ల్, హై ఆక్టేన్ స్టంట్ చేయించార‌ని తెలిపాడు.

Share post:

Latest