ద‌ర్శ‌కుడు పై అలిగిన దీపికా ఎందుకంటే..!?

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ డైరెక్ష‌న్‌లో స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకోన్ నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాయి. భ‌న్సాలీ పై ఇప్పుడు దీపికా అలిగింద‌ని సమాచారం‌. దీనికి కార‌ణం, భ‌న్సాలీ లేటెస్ట్ సినిమా గంగూభాయ్ క‌థియావాడిలో త‌న‌కు లీడ్ రోల్ ఆఫ‌ర్ చేయ‌క‌పోవ‌డ‌మే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో గంగూభాయ్‌గా ఆలియా భ‌ట్ న‌టించింది. ఇప్ప‌టికే విడుదల అయిన ఈ ట్రైల‌ర్‌కు మంచి స్పందన వ‌చ్చింది.

- Advertisement -

అయితే నిజానికి ఈ క్యారెక్ట‌ర్‌లో ఆలియా కంటే దీపికా అయితే బాగుంటుంద‌ని చాలా మంది భావించారు. దీపికా కూడా త‌న‌కు ఆఫ‌ర్ ఇవ్వ‌కుండా ఆలియా ద‌గ్గ‌రికి వెళ్ల‌డంతో భన్సాలీ పై ఆమె అలిగిన‌ట్లు స్పాట్‌బాయ్ అనే న్యూస్‌ సైట్ తెలిపింది. ఆమె అల‌క తీర్చ‌డానికి ఇదే సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌ను భ‌న్సాలీ ఆఫ‌ర్ చేశాడ‌ని, అయితే దానికి ఆమె నిరాక‌రించిన‌ట్లు స్పాట్‌బాయ్ న్యూస్‌ సైట్ తెలిపింది.

Share post:

Popular