రామ్‌సేతులో అక్ష‌య్ లుక్ అదుర్స్ అంటున్న నెటిజన్స్..!

బాలీవుడ్ ఖిలాడి అక్ష‌య్ కుమార్ సంవత్సరానికి నాలుగు ఐదు మూవీస్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వస్తున్నారు. అక్ష‌య్ న‌టించిన సూర్య వంశీ చిత్రం ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఇకపోతే, పృథ్వీరాజ్ సినిమాని నవంబ‌ర్ 5న‌, బ‌చ్చ‌న్ పాండే చిత్రాన్ని జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా అత‌రంగీ రే అనే మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. సారా అలీ ఖాన్ ఇందులో అక్ష‌య్ స‌ర‌స‌న హీరోయిన్ గా చేసింది.ఈ మూవీని ఈ సంవత్సరమే ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నట్లు స‌మాచారం.

ఇక నేటి నుండి రామ్ సేతు అనే ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుకి సంబంధించి షూటింగ్ మొద‌లు పెట్టాడు ఖిలాడీ అక్ష‌య్. మార్చి 18న అయోధ్య రామ జన్మ భూమిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలయింది. అక్ష‌య్ కుమార్ ఆర్కియాల‌జిస్ట్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఈ చిత్రంలో ఆయ‌న లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా అక్ష‌య్ త‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట‌ర్ షేర్ చేయ‌డంతో ఇదే మూవీ లుక్ అయి ఉంటుంద‌ని నెటిజన్స్ భావిస్తున్నారు. మొత్తానికి అక్షయ్ న్యూ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.

Share post:

Latest