“మాస్ట్రో” నుంచి మరో గిఫ్ట్ రెడీ చేసిన నితిన్.!?

తాజాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే చిత్రంతో ఈ సారి పుట్టిన రోజుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు తన బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న మరో చిత్రం మాస్ట్రో నుంచి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రిలీజ్ అయింది. బాలీవుడ్ హిట్ చిత్రం అంధదూన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ మరో గిఫ్ట్ ను నితిన్ కోసం ప్లాన్ చేసారు.

ఈ చిత్రం నుంచి ఈరోజు సాయంత్రం ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియోను 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్చే చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ మూవీ ఇక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రానికి శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.