ఒకేసారి రెండు ఎన్టీఆర్ బయోపిక్‌లు తెరకెక్కుతుండడం ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. అయితే ఇప్పుడు మరో గుడ్ న్యూస్‌తో ఈ ఫ్యాన్స్‌కు డబుల్ స్వీట్ న్యూస్ వచ్చేసింది. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సంగతి అలా ఉంటే ఎన్టీఆర్ కుమారుడు బాలయ్యే స్వయంగా ఓ బయోపిక్‌లో నటిస్తుండడంతో ఈ బయోపిక్ ఇప్పుడు సినిమా వర్గాలు, రాజకీయవర్గాల్లోను పెద్ద ట్రెండింగ్ న్యూస్ అయ్యింది.
మరో సూపర్ థ్రిల్లింగ్ న్యూస్ ఏంటంటే ఈ బయోపిక్‌లో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ నటిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిఫ్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యి తుది మెరుగులు దిద్దుకునే పనిలో ఉంది. ఇక ఈ సినిమా స్టోరీ నిమ్మకూరులో ఎన్టీఆర్ బాల్యం నుంచి స్టార్ట్ అవుతుంది.
ఈ బాల్యానికి సంబంధించి వచ్చేసీన్లలో ఎన్టీఆర్ కుర్రాడి రోల్‌ను బాలయ్య తనయుడు మోక్షుతో చేయించాలని బాలయ్య – తేజ డిసైడైపోయారు. ఈ రోల్‌కు సంబంధించిన సీన్లు 10 నిమిషాల పాటు ఉంటాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ పెద్దయ్యాక పాత్రను బాలయ్య చేస్తాడు. అంటే సాక్షాత్తు తాత ఎన్టీఆర్ పాత్రతో మోక్షు సినీ ఎంట్రీ ఉండనుంది.
ఇది మోక్షుకు ఓ రకంగా చాలా లక్కీ రోల్ అనుకోవాలి. వాస్తవానికి మోక్షు గత యేడాదే బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో వెండితెరకు పరిచయం అవుతాన్న టాక్ వచ్చినా అలా జరగలేదు. ఇక ఇప్పుడు తన తాత బయోపిక్‌లో తాత రోల్లోనే వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు.