మెగాస్టార్‌కు మ‌రో షాక్ ఇచ్చేందుకు ప‌వ‌న్ రెడీ

మెగాస్టార్ చిరంజీవికి, త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్‌కు మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న రూమ‌ర్లు టాలీవుడ్‌లో రోజుకో ర‌కంగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాప్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్యూహాత్మ‌కంగానే మెగా హీరోల ఫంక్ష‌న్ల‌కు హాజ‌రు కావ‌డం లేద‌న్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నెం.150 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది.

ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా ఆడియో ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. చిరు ద‌శాబ్దం త‌ర్వాత హీరోగా చేస్తోన్న సినిమా కావ‌డంతో మెగా హీరోలంద‌రూ ఈ ఫంక్ష‌న్‌కు హాజ‌ర‌వుతున్నారు. ఈ నెల 25న విజ‌య‌వాడ వెళ్లేందుకు వారంతా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప‌వ‌న్ కూడా ఈ ఆడియో ఫంక్ష‌న్‌కు వ‌స్తార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం మరోసారి త‌న అన్న‌కు షాక్ ఇచ్చేలా ఉన్నాడా ? అంటే అవున‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప‌వ‌న్ పొలాచ్చికి బ‌య‌లు దేరుతున్నాడు. ఈనెల 10న కాట‌మ‌రాయుడు యూనిట్ పొలాచ్చి బ‌య‌లు దేరుతోంది. మ‌ళ్లీ ఎప్పుడు తిరిగి వస్తాడో తెలుసా? ఈనెల 26న‌. అంటే.. ఆడియో ఫంక్ష‌న్ రోజున ప‌వ‌న్ మ‌న స్టేట్‌లోనే ఉండ‌డ‌న్న‌మాట‌. ఇదంతా చూస్తుంటే ప‌వ‌న్ ప‌క్కా ప్లానింగ్ ప్ర‌కార‌మే అన్న సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు డుమ్మా కొట్టేలా ప్లాన్ వేసుకున్నాడ‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతున్నాయి.

ఇటీవ‌ల నితిన్‌, స‌ప్త‌గిరి లాంటి వారి ఫంక్ష‌న్స్‌కు కూడా తెగ సంబ‌ర‌ప‌డి వ‌చ్చేస్తోన్న ప‌వ‌న్ సొంత అన్న చిరు ఫంక్ష‌న్‌కు మాత్రం ప్లానింగ్‌తో ఎస్కేప్ చేయ‌డం వెన‌క వీరిద్ద‌రికి మ‌ధ్య బ‌ల‌మైన గ్యాప్ ఉంద‌న్న సందేహాలు మ‌రిన్ని రేకెత్తుతున్నాయి. మెగా బ్ర‌ద‌ర్స్ వైరానికి ఎప్పుడు శుభం కార్డు ప‌డుతుందో చూడాలి.