చిరు”అమ్మ‌డు కుమ్ముడు”పై తమ్మారెడ్డి సీరియ‌స్‌

మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. సెన్సార్ నుంచి యూ/ ఏ స‌ర్టిఫికేట్‌ను ఖైదీ సొంతం చేసుకుంది. కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాకు స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో ఉన్న పాట‌లు ఇప్ప‌టికే యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సాంగ్స్‌లో యూ ట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. “అమ్మడు కుమ్ముడు” అనే పాటకు బ‌య‌ట అదిరిపోయే రేంజ్‌లో రెస్సాన్స్ వ‌స్తోంది. అయితే ఈ పాట‌పై ఓ టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఘాటుగా స్పందించారు. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.

ఖైదీ నం.150 లో చిరంజీవి పాత చిరంజీవి లాగే కనబడుతున్నా, అమ్మడు కుమ్ముడు లాంటి పాట ఇలాంటి కథలో పెట్టడం స‌రిగా లేద‌ని ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. క‌త్తి లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో ఇలాంటి పాట పెట్టే సంద‌ర్భం లేద‌న్నారు. చిరంజీవి డ్యాన్సుల కోస‌మే ఇలాంటి పాట పెట్టి ఉంటార‌న్న ఆయ‌న… త‌నీ ఒరువన్ లాంటి సినిమాని చెడిపోకుండా రీమేక్ చేసిన రామ్ చరణ్ ఈ సినిమాలో ఇలాంటి పాటను ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.