ర‌జ‌నీ 2.0కు షాకింగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

మ‌న తెలుగు సినిమాల బ‌డ్జెట్ కూడా ఇప్పుడు బాలీవుడ్‌కు ధీటుగా ఉంటోంది. తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేయాలంటే త‌క్కువ‌లో త‌క్కువ 50 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు ఈ లెక్క‌ను ఎనిమిది రెట్లు పెంచేశాడు సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ శంక‌ర్. 2.0 సినిమా కోసం ఏకంగా 400 కోట్లు పెట్టిస్తున్నాడు. సౌత్ ఇండియా సినిమాకు రూ.400 కోట్ల బ‌డ్జెట్ అంటే అది ఊహ‌కే అంద‌డం లేదు. ఇది క‌లా ?  నిజ‌మా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ క‌ల‌ను నిజం చేసేశాడు శంక‌ర్‌.

రోబో లాంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న 2.0 సినిమాను హాలీవుడ్‌కు ధీటుగా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా డైరెక్ట‌ర్ శంక‌ర్‌, హీరో ర‌జ‌నీ, న‌టులు మిన‌హా మిగిలిన సాంకేతిక నిపుణులంద‌రూ హాలీవుడ్ సినిమాల‌కు ప‌నిచేసిన వారే. హీరోయిన్ అమీజాక్స‌న్ సైతం బ్రిట‌న్ అమ్మాయే.

2.0 బ‌డ్జెట్ ఏ స్థాయిలో ఉందో.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్‌లో న‌డుస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే 450 కోట్ల బిజినెస్ పూర్తైపోయింది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల కోస‌మే యేడాది టైం తీసుకుంటున్నాడు శంక‌ర్‌. వ‌చ్చే దీపావ‌ళికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రోబో త‌ర్వాత శంక‌ర్ చేసిన ఐ సినిమా స‌రిగ్గా ఆడ‌లేదు. దీంతో శంక‌ర్ 2.0ను క‌సితో తీశాడు. మ‌రి 2.0 ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.