జయమ్ము నిశ్చయమ్ము రా TJ రివ్యూ

సినిమా : జయమ్ము నిశ్చయమ్ము రా
రేటింగ్ : 2.75 / 5
పంచ్ లైన్ : ఇది ఇప్పటి సినిమా కాదు రా

నటీ నటులు:శ్రీనివాస్ రెడ్డి,పూర్ణ,కృష్ణ భగవాన్,ప్రవీణ్,పోసాని తదితరులు
సంగీతం:రవి చంద్ర:
నిర్మాత:సతీష్ కనుమూరి
దర్శకత్వం:శివ రామ రాజు కనుమూరి.

గీతాంజలి సినిమాతో హీరోగా మమ అనిపించుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరో గా ప్రమోషన్ కొట్టేసాడు.దర్శకుడు కనుమూరి ఈ సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి ని సినిమాటిక్ హీరో గా కాకుండా ఎంతో నాచురల్ గా ప్రెజెంట్ చేయడం సినిమాకి పెద్ద అడ్వాంటేజ్.హీరో,దర్శకుడు ఇద్దరూ కూడా అనవసరపు మెరుగులు దిద్దే ప్రయత్నం చేయకుండా కథని అందులోని నటీ నటుల బాలా బలాల్ని బేస్ చేసుకుని సినిమాని నడిపించడం మెచ్చుకోదగిందే.

సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఓ 10 ఏళ్ళ కిందట వచ్చునంటే ఇంపాక్ట్ ఇంకా బావుండేది.ఈ 10 ఏళ్లలో కథలు..కథనాలు.. అవి ప్రెసెంట్ చేసే విధానాల్లో ఎన్నో మార్పులొచ్చాయి.సినిమా ఆద్యంతం ఆసక్తి కరంగానే వున్నా ఇది ఇప్పటి సినిమా కాదు అనే ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది.

కథలో చాలా షేడ్స్ ఉన్న కథ ఇది.ఓ దిగువ మధ్యతరగతి తల్లి కొడుకు కోసం పడే ఆరాటం, ఓ నిరుద్యోగి ధైర్యం,తెలివి,చదువు అన్నీ వున్నా తనపై తనకు నమ్మకం లేక స్వామిజీలని గ్రహాల్ని నమ్ముకునే మూర్ఖత్వం,ఓ ప్రభుత్వోద్యోగి ప్రభుత్వ కార్యాలయం లో ఎదురయ్యే ఇబ్బందులు,పోరాటాలు,చివరగా ఓ ప్రేమకుడు తన ప్రేమ కోసం పడే తపన ఆరాటం. ఇలా అనేక అంశాలు కలగలిసిన కథ ఇది.అన్నీ ఎంతో నాచురల్ గా హేండిల్ చేసినా ఎక్కడా కొత్తగా అనిపించకపోవడం ఈ సినిమాకు అతి పెద్ద లోటు.

సినిమా టెంపో ఎక్కడ పడుతుందనిపించినా దర్శకుడు చాలా తెలివిగా కామెడీ ని నమ్ముకుని సినిమాని నడిపించాడు.కృష్ణ భగవాన్ మంగళవారం కామెడీ ట్రాక్ అంతా అలరిస్తుంది,ప్రవీణ్,పోసాని మధ్య అన్ని వేశాలు,బైక్ కొనడం,అమ్మడం,రవి వర్మ,కోతి బొమ్మ మధ్య సన్నివేశాలు అన్ని బాగానే పేలాయి.

శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుందో మనందరికీ తెలుసు.హీరో అనే సరికి ఆ కమెడియన్ ఇమేజ్ ని అంతా పక్కన పెట్టి తన పాత్రకు న్యాయం చేసాడు.అన్ని వున్నా తనపై తనకు నమ్మకం లేని అమాయకుడిగాను,కొండంత ఆత్మవిస్వాసంతో అందరి ఆటలు కట్టించే వాడిగాను శ్రీనివాస్ రెడ్డి రెండు షేడ్స్ లోను మెప్పించాడు.హీరోయిన్ పూర్ణ ఆర్ట్ సినిమా హీరోయిన్ లా చాలా అందం తో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుంది.మిగిలిన వాళ్లలో ప్రవీణ్,కృష్ణ భగవాన్,పోసాని తదితరులు కామెడీ బాగానే పండించారు.

సాంకేతికంగా హై స్టాండర్డ్స్ లో సినిమా లేకపోయినా ఉన్న బడ్జెట్ లో బాగానే చేయగలిగారు.ట్రేడ్ మార్క్ ప్రమోషనల్ సాంగ్ బాగుంది.నేపధ్య సంగీతం పర్లేదు.ఎడిటింగ్ ఇంకా కత్తెరకు పని చెప్పాల్సింది.మాటలు నాచురల్ గా బాగానే వున్నాయి.స్క్రీన్ ప్లే ఎత్తు పల్లాల తో నడిచిపోతుంది.

ఓవర్ అల్ గా జయమ్ము నిశయమ్ము రా ఆర్ట్ ఫ్లేవర్ ఉన్న 90 ‘s సినిమాని తలపిస్తుంది.సినిమా రన్ టైం రెండున్నర గంటలకి పైగా ఉండటం,కొత్తదనం లేకపోవడం సినిమాని వెనక్కి నెడితే,కామెడీ,సహజత్వానికి దగ్గరగా ఉండటం సినిమాని కాపాడే ప్రయత్నం చేశాయి.