జ‌న‌తా రికార్డుకు చెక్ పెట్టిన ధృవ‌

ఈ ఏడాది టాలీవుడ్‌లో చెప్పుకోద‌గ్గ బిగ్గెస్ట్ హిట్స్  ఏమైనా ఉన్నాయంటే రెండే రెండు… అవి బ‌న్సీ స‌రైనోడు, తార‌క్ మూవీ జ‌న‌తా గ్యారేజీ. దీంతో ఇంకా స‌న్సేష‌న్ సృష్టించే మూవీ కోసం యువ‌త ఎదురు చూస్తోంది. ఈ క్ర‌మంలోనే చెర్రీ మూవీ ధృవ టాక్ సంచ‌ల‌నంగా మారింది. రియ‌ల్ గా చెప్పుకోవాలంటే..  బ‌న్నీ స‌రైనోడు రికార్డుని.. తార‌క్ జ‌న‌తా బీట్ చేసింది. ఇక‌, ధృవ రికార్డు కొట్టాలంటే జ‌న‌తాని మించిపోవాలి. దీంతో ఇప్పుడు అంద‌రూ ధృవ రికార్డు మీదే దృష్టి పెట్టారు.

 

ఈ నేప‌థ్యంలో ధృవకు సంబంధించిన టాక్‌పైనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మొన్నామ‌ధ్య రిలీజ్ అయిన ధృవ ట్రైల‌ర్ సూప‌ర్‌ రికార్డు సొంతం చేసుకుంది.  ఫ‌స్ట్ 4.5 గంటల్లోనే.. 1 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఇది టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్. ఎందుకంటే.. ఇప్పటివరకు టాలీవుడ్‌లో జనతా గ్యారేజ్ పేరిట ఈ రికార్డు ఉంది. 10.5 గంటల సమయంలో జనతా ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ రికార్డ్ సొంతం చేసుకుంది. అంటే జ‌న‌తాని ధృవ బీట్ చేసేసింద‌న్న‌మాట‌.

 

దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఇప్పుడు ట్రైల‌ర్ రికార్డును ప‌క్క‌న పెట్టి క‌లెక్ష‌న్ రికార్డుల గురించి లెక్క‌లు వేస్తున్నారు. ప్ర‌పంచ సంచ‌ల‌నం..  జ‌క్క‌న్న మూవీ బాహుబ‌లి ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డు క‌లెక్ష‌న్ల లిస్టులో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. అదేవిధంగా ప్రిన్స్ మ‌హేష్ మూవీ శ్రీమంతుడు సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. తార‌క్ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు సాధించిన క‌లెక్ష‌న్ రికార్డుల్లో థ‌ర్డ్ ప్లేస్ కొట్టేశాడు. ఈ మూవీ 81 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన‌ట్టు రికార్డు న‌మోదైంది. ఇప్పుడు చరణ్ స‌ధృవ ఈ రేంజ్‌లో క‌లెక్ష‌న్ సాధిస్తుందా?  లేదా చూడాలి! మొత్తానికి ధృవ‌పై మాత్రం అంచ‌నాలు పెరిగిపోతున్నాయి!!